ఎన్ని కరెన్సీ నోట్ల పై మహాత్ముడి ఫొటో ఉంది? ఆర్బీఐ సమాధానం

ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి సమాచారాన్ని పొందేందుకు ప్రజలకు లభించిన బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ). ఈ చట్టం క్రింద RTIarchive.com ఫౌండర్ సత్య నరేష్ అడిగిన ప్రశ్నకు , ఆర్బీఐ ముద్రణా విభాగం వారు సమాధానం ఇచ్చారు. ఆ సమాచారాన్ని  ప్రతీ బారతీయ పౌరుడు మీడియా ద్వారా తెలుసుకునేందుకు వీలుగా  ఈ పత్రికా ప్రకటన జారీ చేస్తున్నాము.  

ప్రశ్న: రోజూవారి మన జీవితంలో ఎదురయ్యే కరెన్సీ నోట్స్ మీద చాలా వరకూ జాతి పిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం చూస్తూంటాం. అయితే ఇప్పటిదాకా ఆ మహాత్ముని బొమ్మ ఎన్ని కరెన్సీ నోట్ల మీద అచ్చయ్యాయి ?

సమాధానం: ఆర్బీఐ వారు ఇచ్చిన సమాధానం ప్రకారం…మహాత్ముడు ఫొటోతో 31-10-2019 దాకా ప్రింటైన  కరెన్సీ నోట్ల సంఖ్య 2, 21,962.55 మిలియన్స్.